Wednesday, 6 November 2013

రక్తపోటును నియంత్రించేందుకు ఆహార నియమాలు

అయితే రక్తపోటును నియంత్రించేందుకు ఆహార నియమాలను పాటిస్తే కాస్త ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు వైద్యులు.
ఉప్పు: ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పువాడకం తగ్గించాలి. రోజుకు 5గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ప్రాసెస్డ్, ప్యాకేజీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్, క్యాన్స్ పదార్థాలు తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికంగా చేస్తుంది.

పొటాషియం: ఇది బీపీని తగ్గిస్తుంది. బీన్స్, బఠాణీలు, నట్స్, పాలకూర, క్యాబేజీ, కొత్తిమీర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమలా, నారింజ, నిమ్మ వంటి పండ్లలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
కొవ్వు పదార్థాలు: వీటివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి బీపీ ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. అందుకే వాటి వాడకం క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. పచ్చళ్లు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటినీ తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.

ఆల్కహాలు: ఈ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానెయ్యాలి. లేదా పరిమితిలో ఉండాలి.
పొగ తాగడం: పొగతాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. తద్వారా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆహారంలో మార్పులు: ఎక్కువ పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయగూరలు, ఆకు కూరలు, పప్పులు వాడాలి. రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి. సాస్‌లు, ఊరగాయలు పూర్తిగా తగ్గించాలి.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment