Sakshi | Updated: June 25, 2013 14:18 (IST)
ఇలా చేయాలి!
రెండు పాదాలను దగ్గరగా ఉంచుకుని రెండు చేతులు శరీరానికి ఇరువైపుల తాకించి నిటారుగా సమస్థితిలో నిలబడాలి.
రెండు పాదాలను ఫొటోలో ఉన్నట్లు కొంచెం దూరంగా ఉంచాలి. తర్వాత కుడిచేతిని పూర్తిగా పైకి లేపి చెవిని తాకేటట్లుగా ఉంచాలి.
ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకుని నిదానంగా వదులుతూ ఎడమ వైపుకి వంగాలి. ఈ స్థితిలో ఎడమ అరచేతిని పాదం పక్కన నేల మీద ఆనించి ఉంచాలి.
కుడి చేయి కుడిచెవిని తాకుతూ ఉండాలి. మోకాళ్లు వంచకూడదు. దృష్టి ముందు వైపుకి ఎదురుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఈ స్థితిలో
ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
ఇదే క్రమాన్ని కుడివైపు కూడా సాధన చేయాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.
ఉపయోగాలు
నడుము దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోవడంతో దేహం నాజూకుగా మారుతుంది.
మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్లు, తుంటిభాగం శక్తిమంతం అవు తాయి.
భుజాలు, మోచేతులు, మణికట్టు కండరాలు దృఢమవుతాయి.
పాదాల నుంచి చేతివేళ్ల వరకు కండరాలు సాగి సరళతరమవుతాయి.
జాగ్రత్తలు...
స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధన చేయాలి.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
No comments:
Post a Comment