Sakshi | Updated: July 23, 2013 02:58 (IST)
ఇలా చేయాలి!
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అంటే... రెండు మోకాళ్ల మీద కూర్చుని
రెండు అరచేతులను తొడల మీద బోర్లించాలి. ఈ స్థితిలో రెండు మడమల మీద పిరుదులు
ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి.
దేహాన్ని పైకి లేపి రెండు మోకాళ్ల మీద నిలబడి, చేతులను శరీరానికి ఇరువైపులా (ఫొటోలో ఉన్నట్లు) ఉంచాలి.
కుడికాలిని (మోకాలు వంచకుండా) వీలైనంతగా చాపాలి. ఎడమచేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో అరచేయి లోపలికి చూస్తుండాలి.
దీర్ఘంగా శ్వాస తీసుకుని నిదానంగా వదులుతూ దేహాన్ని వీలయినంత వరకు
కుడివైపుకి వంచాలి. ఈ స్థితిలో ఎడమ చేతికి- తలకు మధ్య ఖాళీ లేకుండా
చూసుకోవాలి.
ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి.
ఇలా రెండవ వైపు కూడా చేయాలి. ప్రతిరోజూ ఇదే క్రమాన్ని మూడు లేదా ఐదుసార్లు
చేయాలి.
ఉపయోగాలు
శరీరానికి ఉన్న కొవ్వు తొలగిపోవడంతో చక్కటి దేహాకృతి ఏర్పడుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
తొడలకు ఉన్న కొవ్వు కరిగిపోతుంది. నడిచినప్పుడు తొడలు ఒరుసుకుపోతున్న వాళ్లకు ఈ ఆసనం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాళ్లు, చేతులు, భుజాలు, మోకాళ్లు, మెడ కండరాలు శక్తిమంతం అవుతాయి.
చేయకూడనివాళ్ళు
మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు
స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు
స్థూలకాయులు... వీరంతా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
No comments:
Post a Comment