బిగ్గరగా నవ్వాలన్నా భయం, తుమ్మితే ఎక్కడ అభాసుపాలవుతామోననే ఆందోళన, ఏ
శుభకార్యానికీ వెళ్లలేక, నలుగురిలో తిరగలేక, ఇంటికే పరిమితమైపోతే అ బాధ
చెప్పనలవికాదు. యూరిన్ ఇన్‌కాంటినెన్స్(మూత్రవిసర్ జనపై
నియంత్రణ కోల్పోవడం) సమస్యతో బాధపడే వారి పరిస్థితి ఇది. కొంత మంది
స్త్రీలు ఈ సమస్యను తేలిగ్గాతీసుకుంటే, మరికొంత మంది ఈ సమస్యకు చికిత్స
ఉండదని భావిస్తుంటారు. ఇంకొంత మంది బిడియంతో
బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. నిజానికి ఈ సమస్యకు అద్భుతమైన చికిత్స
అందుబాటులో ఉందని, చికిత్సతో సమస్య పూర్తిగా తగ్గిపోతుందని అంటున్నారు
సీనియర్ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ కె. లలిత.
మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడ మనే సమస్య చాలా మంది స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో యాభై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే అందులో పది శాతం మంది స్త్రీలు మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. సమస్య తీవ్రమై దైనందిన జీవితానికి, రోజు వారి పనులకు ఆటంకం కలిగినప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు.
స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం పడిపోతుంది. పొట్టపై ఏ కొంచెం ఒత్తిడి పడినా మూత్రం పడిపోతుంది. వ్యాయామాలతో కుదుటపడుతుందని భావించి, వ్యాయామాలు చేయాలని చూసినా మూత్రం లీక్ అవుతుంటుంది. ప్రసవం కష్టంగా అయిన వారిలో, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కటివలయంలో ఉండే కండరాలు బలహీనం కావడం ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. కొందరిలో మెనోపాజ్ తరువాత ఈ సమస్య బయటపడే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్‌కు సరియైన కారణం తెలుసుకుంటే చికిత్స సులభం అవుతుంది.
అర్జ్ ఇన్‌కాంటినెన్స్
అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బ్లాడర్ ఓవర్ యాక్టివ్‌నెస్ వల్ల ఈ సమస్య మొదలవుతుంది. వయసు పైబడిన వారిలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడాన్ని గమనించవచ్చు. సాధారణంగా బ్లాడర్ ఫుల్ అయినా మూత్రాన్ని ఆపుకునే శక్తి ఉంటుంది. కానీ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉన్న వారిలో మూత్రాన్ని ఏ మాత్రం ఆపుకోలేకపోతారు. బ్లాడర్ కొద్దిగా నిండగానే తెలియకుండానే పడిపోతుంటుంది. అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌తో బాధపడే వారు త్వరత్వరగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి రావడం, వెళ్లే లోపలే మూత్రం పడిపోవడం జరుగుతుంది. ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. యూరినరీ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా అర్జ్ కాంటినెన్స్ రావచ్చు. కానీ వీరిలో ఇన్‌ఫెక్షన్ తగ్గగానే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో స్టోన్స్ ఉండటం, బ్లాడర్‌లో ట్యూమర్స్, పెరాలసిస్, నాడీ వ్యవస్థకు దెబ్బలు తగిలినప్పుడు, వెన్నెముకకు గాయాలయినప్పుడు కూడా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ సమస్య మొదలుకావచ్చు. కొందరిలో మూత్రాశయ కండరాలు అవసరం లేకుండానే సంకోచించడం వల్ల మూత్రం మాటిమాటికి రావడం, వెంటనే వెళ్లవలసి రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అనేది మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రావచ్చు.
మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్
కొందరిలో స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్, అర్జ్ ఇన్‌కాంటినెన్స్ లక్షణాలు రెండూ ఉంటాయి. ఈ సమస్యను మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఇలాంటప్పుడు ఏ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించి చికిత్స అందించాల్సి ఉంటుంది.
బ్లాడర్ ఖాళీ అవుతోందా?
సాధారణంగా యూరిన్ బ్లాడర్‌లో 400 నుంచి 500 ఎంఎల్ వరకు మూత్రం నిలువ ఉండగలదు. కిడ్నీల నుంచి నిరంతరం తయారయి వస్తున్న మూత్రాన్ని నిలువ ఉంచడం, నిండినప్పుడు మూత్రవిసర్జన ద్వారా ఖాళీ అయ్యేలా చూడటం వంటి పనులను బ్లాడర్ నిర్వర్తిస్తుంది. వయసు పైబడిన స్త్రీలలో మూత్రం లీక్ అవుతూ ఉంటే కనుక ముందుగా బ్లాడర్ ఖాళీ అవుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ఎందుకంటే వారిలో తెలియకుండానే మూత్రం కొంత బ్లాడర్ నిలువ ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడు మూత్రవిసర్జన చేసినా కొంత మూత్రం బ్లాడర్‌లో ఉండిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
చికిత్స
యూరిన్ ఇన్‌కాంటినెన్స్ సమస్య చాలా వరకు మందులతో తగ్గిపోతుంది. కారణం తెలుసుకుని చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే తొలగించడం, ఇన్‌ఫెక్షన్స్ ఉంటే యాంటీబయోటిక్స్ వాడటం చేయాలి. కారణం తెలియకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి బ్లాడర్ ఖాళీ అవుతోందా లేదా పరిశీలించాలి. అంటే మూత్ర విసర్జనకు ముందు ఒకసారి, విసర్జన తరువాత ఒకసారి స్కాన్ చేసి చూడాలి. అప్పటికీ కారణం తెలియకపోతే యూరో డైనమిక్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్లాడర్ ఓవర్‌యాక్టివ్ వల్ల యూరిన్ లీక్ అవుతోందా తెలుసుకోవచ్చు. ఇది అధునాతమైన పరీక్ష. అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌కు మందులు బాగా ఉపయోగపడతాయి. బ్లాడర్ ఓవర్‌యాక్టివ్ వల్ల యూరిన్ లీక్ అవుతుంటే కనుక తగ్గించడానికి మందులు ఉపయోగపడపతాయి. కొంతమందిలో న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడు బొటాక్స్ అనే మందు ఉపయోగించి చికిత్స అందించడం జరుగుతుంది. కొంత మందిలో యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి. అటువంటి వారు మందులు వాడుతూ క్రాన్‌బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్‌తో బాధపడే వారు కీగెల్స్ వ్యాయామాలు చేసినట్లయితే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేసినట్లయితే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ పర్యవేక్షణలో నేర్చుకుని చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. వ్యాయామంతో ఫలితం లేనప్పుడు మినిమల్ ఇన్‌వేసివ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ సర్జరీలో భాగంగా మెష్‌ను అమర్చడం జరుగుతుంది. ఎటువంటి కోతా లేకుండానే ఎండోస్కోపి గైడెన్స్‌లో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. డేకేర్‌లో చేసుకుని వెళ్లిపోవచ్చు. మూత్రవిసర్జనపై ఏ కారణం వల్ల నియంత్రణ కోల్పోయినా బిడియపడకుండా యూరోగైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.
డా. కె. లలిత
సీనియర్ యూరోగైనకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ , హైదరాబాద్
ఫోన్ : 950 234 7362
Courtesy-Ayurooarogyalu

No comments:
Post a Comment