సూర్యభగవానుడికి అంకితం ఇచ్చిన ఆసనం ఇది
Sakshi | Updated: July 09, 2013 02:55 (IST)
మరీచాయః అంటే వెలుతురు కిరణం అని అర్థం. ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తున్న సూర్యభగవానుడికి అంకితం ఇచ్చిన ఆసనం ఇది.
ఎలా చేయాలి!
రెండుకాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.
కుడికాలిని మోకాలి దగ్గర మడిచి 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. కుడి అరచేతిని కుడిపాదం పైన ఉంచాలి.
శ్వాస పూర్తిగా తీసుకుని నిదానంగా వదులుతూ కుడిమోకాలుని కుడిచేతితో
చుట్టి, ఎడమచేతిని వీపు వెనుకభాగం వైపు తీసుకెళ్లి రెండు చేతుల్ని పరస్పరం
బంధించి పట్టుకోవాలి. అదే సమయంలో తలను తిప్పి ఎడమ భుజం మీదుగా
చూస్తుండాలి.
ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి
రావాలి. అలాగే రెండవ వైపు కూడా సాధన చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి
ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
భుజాలు, మోచేతులు, మణికట్టు భాగాలు శక్తిమంతం అవుతాయి.
వెన్నెముక సరళతరమవుతుంది.
కాలేయం, స్ల్పీన్ ఉత్తేజితం అవుతాయి.
ఛాతీ శక్తిమంతం అయి శ్వాసకోశ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఛాతీ విశాలమవుతుంది.
ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి ఫలితాలనిస్తుంది.
జాగ్రత్తలు...
భుజాలు అరిగినవాళ్లు, మోచేతుల సమస్య ఉన్నవాళ్లు, స్పాండిలోసిస్ ఉన్నవాళ్లు తల తిప్పకుండా చేయాలి.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్
No comments:
Post a Comment