Sakshi | Updated: July 16, 2013 03:20 (IST)
అనంత పద్మనాభుడు అనేది శ్రీమహావిష్ణువుకు
ఉన్న మరో పేరు. శేషశయ్య మీద పవళించిన విష్ణుమూర్తిని పోలి ఉంటుంది కనుక ఈ
ఆసనానికి అనంతాసనం అని పేరు.
ఎలా చేయాలి?
నేల మీద ఎడమవైపు తిరిగి పడుకుని ఎడమ అరచేతిలో తలను ఉంచి విశ్రమించాలి.
కుడిచేతిని కుడివైపు శరీరం పైన తిన్నగా(ఫొటోలో ఉన్నట్లు) ఉంచాలి.
శ్వాస పూర్తిగా తీసుకుని కుడికాలిని నిటారుగా పైకి లేపి 90 డిగ్రీల
కోణంలో ఉండేలా చూసుకోవాలి. కుడిచేతిని పైకి లేపి కుడికాలి వేళ్లను చేతితో
పట్టుకోవాలి. ఎడమకాలిని చక్కగా నేల మీద చాచి ఉంచాలి.
ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి
రావాలి. అలాగే రెండవ వైపు కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు
చేయాలి.
ఉపయోగాలు
మోకాళ్లు, తొడలు, భుజాలు, మెడ కండరాలు శక్తిమంతం అవుతాయి.
శరీరానికి రెండువైపులా ఉన్న కొవ్వు తొలగిపోయి నడుము సన్నబడుతుంది.
రుతుక్రమ సమస్యలు, మలబద్దకం తొలగిపోతాయి.
శ్వాసకోశ వ్యవస్థ శక్తిమంతం అవుతుంది.
జాగ్రత్త!
స్పాండిలోసిస్ ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
No comments:
Post a Comment