చక్కర వ్యాధి ని రాకుండా చెయ్య టానికి షుగర్ వ్యాధి రావటానికి గల కారణాలు
చాలా వరకు మన చేతుల్లో లేవు . వచ్చిన పిదప కంట్రోల్ లో పెట్టు కోవటమే
మార్గం , తల్లి తండ్రికి ఉంటె పిల్లలకి వచ్చే అవకాశం ఉంది . అందుచేత
అట్లాంటి రిస్క్ ఫాక్టర్ ఉన్న వారు 20 ఏళ్ళు దాటినా వెంటనే , ప్రీ
డయాబెటిస్ టెస్ట్ చేయించు కోవాలి
కంట్రోల్ లో ఉంచు కోవాలంటే ఏం చెయ్యాలి ?
డాక్టర్ గారు చెప్పినట్లు గా మందులు వాడాలి . వారు సూచించిన విధంగా టెస్ట్ లు చేయించు కోవాలి
డయాబెటిస్ వస్తే మిగిలిన శరీరం లో ని భాగాలన్నీ నెమ్మదిగా నాశనం
అవుతాయి . అందుచేత షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసు కో రాదు
ప్రతి రోజు , డాక్టర్ సూచించినట్లు గా శరీరం లో ని బరువు , ఎత్తు ఆధారంగా ఎన్ని calories ఫుడ్ అవసరమో అంతే తీసుకోవాలి
1. . ప్రతి రోజు ఏదో ఒక పండు , తినాలి . అంటే జామకాయ, రేగి పండు, మితంగా బొప్పాయి ముక్కలు, వాటర్ మెలాన్ , పుచ్చకాయ మొదలయినవి
2 అను నిత్యం వాకింగ్ చెయ్యాలి . ఈ వాకింగ్ ఎంత చెయ్యాలి అన్నది పేషెంట్ పేషెంట్ కి మారుతుంది . డాక్టర్ గారు సూచిస్తారు
3. తినే ఆహరం ఒక్క సారే తినకుండా మితంగా రోజుకి 5 లేక 6 సార్లు
తీసుకోవాలి ఆహారం లో ఆకు కూరలు, ఫైబర్ , ప్రోటీన్ లు ఎక్కువగా ఉన్నవి తీసు
కోవాలి . దుమ్పకూరలు ను తిన గూడదు
4. టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజక్షన్ డాక్టర్ చెప్పినట్లు టైం కి తీసు కోవాలి
5. ప్రతి 6 నెలలకి ఒక సారి ఈ టెస్ట్ లు చేయించు కోవాలి
అ. లిపిడ్ ప్రొఫైల్
ఆ glyco syllated హేమో గ్లోబిన్ . ఈ టెస్ట్ వలన గత 3 నెలలు గా షుగర్ అదుపు లో ఉందీ లేనిది తెలుపుతుంది
ఇ పూర్తీ మూత్ర పరీక్షా
ఈ urine ఫర్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్
ఉ కళ్ళు, కాళ్ళు చెక్ అప్ .
ఊ మూత్ర పిండాలు పని చేసే విధానం టెస్ట్ ( Renal function test )
రు ఎక్కువగా మానసిక వత్తిడికి లోను కాగూడదు
No comments:
Post a Comment