రసం / చారు తెలుగువారి ఇళ్ళలో అతి సాధారణంగా వుండేదే. టొమేటో, నిమ్మకాయ,
అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వంటి ఒకే తరహా దినుసులతో అనేక
పద్ధతుల్లో తయారుచేసే రసం / చారు మనిషి సంపూర్ణారోగ్యానికి
ఎంతో సహకరిస్తుంది. రుచి కోసం అదనంగా కలుపుకునే మసాలాలు లేకుండా
ప్లెయిన్‌గా తయారుచేసే ఏ రసమైనా శరీరానికి మేలు చేస్తుంది. కూర కంటే రసం
అన్నంలో మొత్తంగా కలిసిపోతుంది. రసంలో ఉపయోగించిన వస్తువుల ప్రయోజనాలను
ప్రతి మెతుకూ పీల్చుకుంటుంది. ఫలితంగా అన్నం మెత్తబడి జీర్ణవ్యవస్థకు
సులభంగా మారుతుంది. రసం వల్ల కిడ్నీల దాకా చేరే ఆహార పదార్థాలన్నీ చాలా
సాఫీగా తయారవుతాయి. ఆహారవాహికలో, ఇతర ప్రదేశాల్లో ఇరుక్కుపోయిన జీర్ణం కాని
ఆహారాన్ని కూడా రసం జీర్ణవాహిక వైపుకు ఎగదోస్తుంది. ఫలితంగా కడుపులో
అజీర్ణ ఆహారం ఏదీ మిగలదు. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఒకపూట
తప్పనిసరిగా రసం భోజనం తీసుకుంటే, జీవితంలో డాక్టర్‌ను చూడాల్సిన అవసరం
లేదంటారు. మంచి ఆరోగ్యం కోరుకునేవారు ఈ సూచన పాటించవచ్చు.
No comments:
Post a Comment