Friday, 29 November 2013

Jaggery For health benifits

Jaggery a traditional Indian sweetener made from sugarcane and is believed to be a healthy substitute for sugar. It is a good source of essential minerals such as iron, magnesium, phosphorus and zinc. According to ancient Indian texts, jaggery is a medicinal sweetener which purifies blood, aids digestion and improves lung health. The popular belief that jaggery is a harmless sugar substitute for diabetics is often challenged by health experts, however due to lack of awareness, it is widely used to sweeten foods and beverages by diabetics. - 
the high potassium content in jaggery is often associated with its weight loss benefits as potassium helps in reducing water retention in the body.

Potassium helps build muscle, maintains the body's electrolyte balance and improves metabolism - the conditions which support weight loss. The flip side is that the high carbohydrate content in jaggery may hamper your weight loss goals.

jaggery has tremendous health benefits. Jaggery retains essential minerals such as magnesium, calcium, phosphorus, potassium, iron, copper and zinc. According to Ayurveda, jaggery strengthens the nervous system, prevents anemia and promotes bone health. It may also protect the body against environmental toxins. -

Monday, 25 November 2013

మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోతే...

బిగ్గరగా నవ్వాలన్నా భయం, తుమ్మితే ఎక్కడ అభాసుపాలవుతామోననే ఆందోళన, ఏ శుభకార్యానికీ వెళ్లలేక, నలుగురిలో తిరగలేక, ఇంటికే పరిమితమైపోతే అ బాధ చెప్పనలవికాదు. యూరిన్ ఇన్‌కాంటినెన్స్(మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం) సమస్యతో బాధపడే వారి పరిస్థితి ఇది. కొంత మంది స్త్రీలు ఈ సమస్యను తేలిగ్గాతీసుకుంటే, మరికొంత మంది ఈ సమస్యకు చికిత్స ఉండదని భావిస్తుంటారు. ఇంకొంత మంది బిడియంతో బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. నిజానికి ఈ సమస్యకు అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉందని, చికిత్సతో సమస్య పూర్తిగా తగ్గిపోతుందని అంటున్నారు సీనియర్ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ కె. లలిత.
మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడ మనే సమస్య చాలా మంది స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో యాభై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే అందులో పది శాతం మంది స్త్రీలు మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. సమస్య తీవ్రమై దైనందిన జీవితానికి, రోజు వారి పనులకు ఆటంకం కలిగినప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు.

స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం పడిపోతుంది. పొట్టపై ఏ కొంచెం ఒత్తిడి పడినా మూత్రం పడిపోతుంది. వ్యాయామాలతో కుదుటపడుతుందని భావించి, వ్యాయామాలు చేయాలని చూసినా మూత్రం లీక్ అవుతుంటుంది. ప్రసవం కష్టంగా అయిన వారిలో, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కటివలయంలో ఉండే కండరాలు బలహీనం కావడం ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. కొందరిలో మెనోపాజ్ తరువాత ఈ సమస్య బయటపడే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్‌కు సరియైన కారణం తెలుసుకుంటే చికిత్స సులభం అవుతుంది.

అర్జ్ ఇన్‌కాంటినెన్స్

అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బ్లాడర్ ఓవర్ యాక్టివ్‌నెస్ వల్ల ఈ సమస్య మొదలవుతుంది. వయసు పైబడిన వారిలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడాన్ని గమనించవచ్చు. సాధారణంగా బ్లాడర్ ఫుల్ అయినా మూత్రాన్ని ఆపుకునే శక్తి ఉంటుంది. కానీ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉన్న వారిలో మూత్రాన్ని ఏ మాత్రం ఆపుకోలేకపోతారు. బ్లాడర్ కొద్దిగా నిండగానే తెలియకుండానే పడిపోతుంటుంది. అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌తో బాధపడే వారు త్వరత్వరగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి రావడం, వెళ్లే లోపలే మూత్రం పడిపోవడం జరుగుతుంది. ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. యూరినరీ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా అర్జ్ కాంటినెన్స్ రావచ్చు. కానీ వీరిలో ఇన్‌ఫెక్షన్ తగ్గగానే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో స్టోన్స్ ఉండటం, బ్లాడర్‌లో ట్యూమర్స్, పెరాలసిస్, నాడీ వ్యవస్థకు దెబ్బలు తగిలినప్పుడు, వెన్నెముకకు గాయాలయినప్పుడు కూడా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ సమస్య మొదలుకావచ్చు. కొందరిలో మూత్రాశయ కండరాలు అవసరం లేకుండానే సంకోచించడం వల్ల మూత్రం మాటిమాటికి రావడం, వెంటనే వెళ్లవలసి రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అనేది మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రావచ్చు.

మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్

కొందరిలో స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్, అర్జ్ ఇన్‌కాంటినెన్స్ లక్షణాలు రెండూ ఉంటాయి. ఈ సమస్యను మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఇలాంటప్పుడు ఏ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించి చికిత్స అందించాల్సి ఉంటుంది.

బ్లాడర్ ఖాళీ అవుతోందా?

సాధారణంగా యూరిన్ బ్లాడర్‌లో 400 నుంచి 500 ఎంఎల్ వరకు మూత్రం నిలువ ఉండగలదు. కిడ్నీల నుంచి నిరంతరం తయారయి వస్తున్న మూత్రాన్ని నిలువ ఉంచడం, నిండినప్పుడు మూత్రవిసర్జన ద్వారా ఖాళీ అయ్యేలా చూడటం వంటి పనులను బ్లాడర్ నిర్వర్తిస్తుంది. వయసు పైబడిన స్త్రీలలో మూత్రం లీక్ అవుతూ ఉంటే కనుక ముందుగా బ్లాడర్ ఖాళీ అవుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ఎందుకంటే వారిలో తెలియకుండానే మూత్రం కొంత బ్లాడర్ నిలువ ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడు మూత్రవిసర్జన చేసినా కొంత మూత్రం బ్లాడర్‌లో ఉండిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
చికిత్స

యూరిన్ ఇన్‌కాంటినెన్స్ సమస్య చాలా వరకు మందులతో తగ్గిపోతుంది. కారణం తెలుసుకుని చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే తొలగించడం, ఇన్‌ఫెక్షన్స్ ఉంటే యాంటీబయోటిక్స్ వాడటం చేయాలి. కారణం తెలియకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి బ్లాడర్ ఖాళీ అవుతోందా లేదా పరిశీలించాలి. అంటే మూత్ర విసర్జనకు ముందు ఒకసారి, విసర్జన తరువాత ఒకసారి స్కాన్ చేసి చూడాలి. అప్పటికీ కారణం తెలియకపోతే యూరో డైనమిక్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్లాడర్ ఓవర్‌యాక్టివ్ వల్ల యూరిన్ లీక్ అవుతోందా తెలుసుకోవచ్చు. ఇది అధునాతమైన పరీక్ష. అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌కు మందులు బాగా ఉపయోగపడతాయి. బ్లాడర్ ఓవర్‌యాక్టివ్ వల్ల యూరిన్ లీక్ అవుతుంటే కనుక తగ్గించడానికి మందులు ఉపయోగపడపతాయి. కొంతమందిలో న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడు బొటాక్స్ అనే మందు ఉపయోగించి చికిత్స అందించడం జరుగుతుంది. కొంత మందిలో యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి. అటువంటి వారు మందులు వాడుతూ క్రాన్‌బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్‌తో బాధపడే వారు కీగెల్స్ వ్యాయామాలు చేసినట్లయితే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేసినట్లయితే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ పర్యవేక్షణలో నేర్చుకుని చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. వ్యాయామంతో ఫలితం లేనప్పుడు మినిమల్ ఇన్‌వేసివ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ సర్జరీలో భాగంగా మెష్‌ను అమర్చడం జరుగుతుంది. ఎటువంటి కోతా లేకుండానే ఎండోస్కోపి గైడెన్స్‌లో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. డేకేర్‌లో చేసుకుని వెళ్లిపోవచ్చు. మూత్రవిసర్జనపై ఏ కారణం వల్ల నియంత్రణ కోల్పోయినా బిడియపడకుండా యూరోగైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.

డా. కె. లలిత
సీనియర్ యూరోగైనకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ , హైదరాబాద్
ఫోన్ : 950 234 7362

Courtesy-Ayurooarogyalu

Tuesday, 19 November 2013

Dont sleep near your cell phone

Recent studies have linked sleeping near your cell phone to lack of sleep. Most cell phones have 884 MHz wireless signals ...emitting radiation. One study, done by M.I.T exposed subjects to "mobile phone radiation" as they were about to sleep. Many phones have 884 MHz wireless signals, which have been linked to affecting one's sleep. Cell phone radiation exposure during the night can reduce one's ability to recuperate from a stressful and difficult day.

SHARE AS MUCH AS YOU CAN

రోజూ ఒక కప్పు రసం అన్నం - సంపూర్ణారోగ్యానికి మార్గం

రసం / చారు తెలుగువారి ఇళ్ళలో అతి సాధారణంగా వుండేదే. టొమేటో, నిమ్మకాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వంటి ఒకే తరహా దినుసులతో అనేక పద్ధతుల్లో తయారుచేసే రసం / చారు మనిషి సంపూర్ణారోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. రుచి కోసం అదనంగా కలుపుకునే మసాలాలు లేకుండా ప్లెయిన్‌గా తయారుచేసే ఏ రసమైనా శరీరానికి మేలు చేస్తుంది. కూర కంటే రసం అన్నంలో మొత్తంగా కలిసిపోతుంది. రసంలో ఉపయోగించిన వస్తువుల ప్రయోజనాలను ప్రతి మెతుకూ పీల్చుకుంటుంది. ఫలితంగా అన్నం మెత్తబడి జీర్ణవ్యవస్థకు సులభంగా మారుతుంది. రసం వల్ల కిడ్నీల దాకా చేరే ఆహార పదార్థాలన్నీ చాలా సాఫీగా తయారవుతాయి. ఆహారవాహికలో, ఇతర ప్రదేశాల్లో ఇరుక్కుపోయిన జీర్ణం కాని ఆహారాన్ని కూడా రసం జీర్ణవాహిక వైపుకు ఎగదోస్తుంది. ఫలితంగా కడుపులో అజీర్ణ ఆహారం ఏదీ మిగలదు. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఒకపూట తప్పనిసరిగా రసం భోజనం తీసుకుంటే, జీవితంలో డాక్టర్‌ను చూడాల్సిన అవసరం లేదంటారు. మంచి ఆరోగ్యం కోరుకునేవారు ఈ సూచన పాటించవచ్చు.

డయాబెటిస్‌ను అడ్డుకోవచ్చు

డయాబెటిస్ అంటే ఇక జీవితాంతం దాంతో తీరని సమస్యే అని భయపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇకముందు ఆ భయం అక్కర్లేదంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హనుమంతరావు. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద డయాబెటిస్ బాధితుల కొరకు ప్రపంచ ప్రామాణికమైన, అత్యున్నతమైన వైద్యాన్ని తీసుకొని వచ్చిందనీ, ఆ ఆధునిక ఆయుర్వేద వైద్యం డయాబెటిస్ నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తుందని ఆయన చెబుతున్నారు.

డయాబెటిస్ వల్ల శారరకంగానే కాదు మానసికంగా ఎక్కువ కుంగిపోతుండటం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి వందమందిలో 14మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల నుంచి ఆహారంలో ఏర్పడిన మార్పులకు అనేక విషయాలు ఇందుకు కారణం.

డయాబెటిస్ వ్యాధి వల్ల దుష్ఫలితాలు కింది విధంగా ఉంటాయి.

లక్షణాలు, దుష్ఫలితాలు విపరీతంగా దాహం పెరుగుతుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జన.

విపరీతంగా ఆకలి వేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవుట, బలహీనంగా ఉండటం.

బరువు తగ్గి చిక్కిపోవటం, నీరసం, నిస్సత్తువ.
చూపు మందగించటం, మబ్బుగా, మసకమసకగా కనిపించడం
విపరీతమైన అలసట, కాళ్లు లాగటం.
ఏదైనా గాయాలు తగిలితే త్వరగా తగ్గకపోవటం.

కొన్ని సంవత్సరాల తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినుట వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు దెబ్బ తింటాయి.

చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నందువల్ల కంటిలోని రెటీనా కూడా దెబ్బ తింటుంది.

నరాల బలహీనత, కళ్లల్లో మంటలు మానసిక ఒత్తిడి, శృంగార సమస్యలు ఎక్కువ కావటం.

సైడ్ ఎఫెక్టులుండవు

డయాబెటిస్‌ను సరైన శ్రద్ధతో కంట్రోల్‌లో వుంచుకోవాలి. అలాచేయకపోతేనే అది క్రమంగా మీ శరీరాన్ని కబళిస్తుంది. షుగర్ వ్యాధిని నిరోధించడానికి తరుచుగా వాడే పాశ్చాత్య రసాయనాలు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినప్పటికీ వాటి ద్వారా ఏర్పడే దుష్ఫలితాలూ ఎక్కువే ఉన్నాయి. పాశ్చాత్య రసాయనాలు తరుచుగా వాడటం వలన చర్మం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణ సంబంధిత బాధలు వంటి అవాంఛిత ప్రక్రియలు మొదలవుతాయి. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసే వైద్యం ఆయుర్వేదం ఒక్కటే. నిజానికి ఆయుర్వేదం ఎంత ప్రభావమైనదో, అంత శాశ్వతమైనది కూడా. అందుకే ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించబోతోంది. 36 సంవత్సరాలు అనుభవంతో, ప్రకృతి ప్రసాదించిన వనమూలికల ద్వారా ఎన్నో లక్షల మంది పేషెంట్లకు ఉపశమనం కలిగిస్తూ వస్తున్న ఆయుర్వేదం వైద్యంలో ఇప్పుడు అత్యాధునికి మందులు డయాబెటిస్ వ్యా«ధిగ్రస్తుల కోసం అందుబాటులోకి వచ్చాయి.

ఆయుర్వేదం వైద్యమే ప్రత్యేక పంథాలో సాగుతుందనే విషయం తెలిసిందే. వ్యాధిగ్రస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అది ప్రక్రియ అనువంశికమా? లేక మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? అనే విషయంలో నిపుణులైన డాక్టర్లు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే రోగ లక్షణాలకు, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది.

ప్రి-డయాబెటిక్ ట్రీట్‌మెంట్

ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వలన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సరికొత్త జీవితం మొదలవుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. డయాబెటిస్‌ను ఎప్పుడూ ఒక తీరని వ్యాధిగా భావించనవసరం లేదు. ఎందుకంటే అది కేవలం మీరు అవలంభించవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యంతో మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి డయాబెటిస్‌ను కంట్రోల్ ఉంచడమే కాదు, 'ప్రి-డయాబెటిక్ ట్రీట్‌మెంట్'తో పూర్తిగా నయం చేయవచ్చు.

ఉదాహరణకు, అత్యాధునిక స్టార్ ఆయుర్వేద మందులతో పాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకొనుట, ఉప్పు, చక్కెర సంబంధిత పదార్థాలు తగ్గించడం, మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా నివారించవచ్చును.

సంప్రదాయత, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో అందుబాటులో ఉన్నారు. స్టార్ ఆయుర్వేద హాస్పిటల్స్ అందిస్తున్న ఆదునిక ఆయుర్వేదం వైద్యం శక్తివంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇక, డయాబెటిస్ గురించి బాధగానీ, భయం అవసరం లేదు.

డాక్టర్ హనుమంతరావు, ఎండీ ఆయుర్వేద,
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, హన్మకొండ, కర్నాటక.
ఫోన్: 90300 81861, 90300 81876

TAKE CARE OF YOUR EYES WHILE USING PC

During a recent visit to an optician, one of my friend was told of an exercise for the eyes by a specialist doctor that he termed as 20-20-20. It is apt for all of us, who

spend long hours at our desks, looking at the computer screen.

I Thought I'd share it with you.

20-20-20

Step I :-

After every 20 minutes of looking into the computer screen, turn your head and try to look at any object placed at least 20 feet away. This changes the focal length of

your eyes, a must-do for the tired eyes.

Step II :-

Try and blink your eyes for 20 times in succession, to moisten them.

Step III :-

Time permitting of course, one should walk 20 paces after every 20 minutes of sitting in one particular posture. Helps blood circulation for the entire body.

Circulate among all if you care. They say that your eyes are mirrors of your soul, so do take care of them, they are priceless

Monday, 18 November 2013

త్రికోణాసనం

Sakshi | Updated: June 25, 2013 14:18 (IST)
త్రికోణాసనం
హైదరాబాద్‌ : ఈ ఆసన స్థితిలో శరీర భంగిమ మూడు కోణాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని త్రికోణాసనం అంటారు.

ఇలా చేయాలి!
రెండు పాదాలను దగ్గరగా ఉంచుకుని రెండు చేతులు శరీరానికి ఇరువైపుల తాకించి నిటారుగా సమస్థితిలో నిలబడాలి.

రెండు పాదాలను ఫొటోలో ఉన్నట్లు కొంచెం దూరంగా ఉంచాలి. తర్వాత కుడిచేతిని పూర్తిగా పైకి లేపి చెవిని తాకేటట్లుగా ఉంచాలి.

ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకుని నిదానంగా వదులుతూ ఎడమ వైపుకి వంగాలి. ఈ స్థితిలో ఎడమ అరచేతిని పాదం పక్కన నేల మీద ఆనించి ఉంచాలి.

కుడి చేయి కుడిచెవిని తాకుతూ ఉండాలి. మోకాళ్లు వంచకూడదు. దృష్టి ముందు వైపుకి ఎదురుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఈ స్థితిలో

ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.

ఇదే క్రమాన్ని కుడివైపు కూడా సాధన చేయాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.

ఉపయోగాలు
 నడుము దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోవడంతో దేహం నాజూకుగా మారుతుంది.

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్లు, తుంటిభాగం శక్తిమంతం అవు తాయి.

భుజాలు, మోచేతులు, మణికట్టు కండరాలు దృఢమవుతాయి.

పాదాల నుంచి చేతివేళ్ల వరకు కండరాలు సాగి సరళతరమవుతాయి.

జాగ్రత్తలు...
స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధన చేయాలి.

మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల

క్రౌంచాసనం

క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు

Sakshi | Updated: July 02, 2013 03:28 (IST)
క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు
హైదరాబాద్‌ :
 క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు. వాటిలో ఇప్పుడు మనం చూపిస్తున్న విధానం ఒకటి. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం క్రౌంచ పక్షి ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని క్రౌంచాసనం అంటారు.
 
 ఎలా చేయాలి!
 రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి. 
 
 ఎడమకాలిని మోకాలి దగ్గర మడిచి ఎడమ పిరుదు పక్కన ఉంచాలి.
 
 శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని వీలైనంత వరకు నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలిని వంచకుండా(ఫొటోలో చూపినట్లుగా) గడ్డాన్ని మోకాలికి తాకించాలి.
 
 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 తొడల మీద ఉన్న కొవ్వు కరిగిపోతుంది. కాళ్లకు బలం వస్తుంది. 
 
 వీపు దిగువ భాగం, పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి.
 
 గ్యాస్ట్రిక్ సమస్య, అజీర్తి, మలబద్దకం తొలగిపోతాయి.
 
 బీజకోశం, గర్భకోశాలకు శక్తి చేకూరుతుంది. రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.
 
 ఏకాగ్రత పెరుగుతుంది, భుజాలకు బలం వస్తుంది.
 
 జాగ్రత్తలు...
 మోకాళ్ల నొప్పులు, స్పాండిలోసిస్  ఉన్న వాళ్లు గురువు పర్యవేక్షణలో చేయాలి.
 
 రుతుక్రమ సమయంలో చేయకూడదు.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, 
 నేషనల్ యోగా చాంపియన్

మరీచాసనం

సూర్యభగవానుడికి అంకితం ఇచ్చిన ఆసనం ఇది

Sakshi | Updated: July 09, 2013 02:55 (IST)
సూర్యభగవానుడికి అంకితం ఇచ్చిన ఆసనం ఇది
హైదరాబాద్‌ :
మరీచాయః అంటే వెలుతురు కిరణం అని అర్థం. ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తున్న సూర్యభగవానుడికి అంకితం ఇచ్చిన ఆసనం ఇది.
 
 ఎలా చేయాలి!
 రెండుకాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.
 
 కుడికాలిని మోకాలి దగ్గర మడిచి 90 డిగ్రీల కోణంలో  ఉండేలా చూసుకోవాలి. కుడి అరచేతిని కుడిపాదం పైన ఉంచాలి. 
  
 శ్వాస పూర్తిగా తీసుకుని నిదానంగా వదులుతూ కుడిమోకాలుని కుడిచేతితో చుట్టి, ఎడమచేతిని వీపు వెనుకభాగం వైపు తీసుకెళ్లి రెండు చేతుల్ని పరస్పరం బంధించి పట్టుకోవాలి. అదే సమయంలో తలను తిప్పి ఎడమ భుజం మీదుగా చూస్తుండాలి. 
 
 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ వైపు కూడా సాధన చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 భుజాలు, మోచేతులు, మణికట్టు భాగాలు శక్తిమంతం అవుతాయి.  
 
 వెన్నెముక సరళతరమవుతుంది. 
 
 కాలేయం, స్ల్పీన్ ఉత్తేజితం అవుతాయి. 
 
 ఛాతీ శక్తిమంతం అయి శ్వాసకోశ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఛాతీ విశాలమవుతుంది. 
 
 ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి ఫలితాలనిస్తుంది.
 
 జాగ్రత్తలు...
 భుజాలు అరిగినవాళ్లు, మోచేతుల సమస్య ఉన్నవాళ్లు, స్పాండిలోసిస్  ఉన్నవాళ్లు తల తిప్పకుండా చేయాలి.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత,  నేషనల్ యోగా చాంపియన్

అనంతాసనం

Sakshi | Updated: July 16, 2013 03:20 (IST)
అనంతాసనం
హైదరాబాద్‌ :
 అనంత పద్మనాభుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉన్న మరో పేరు. శేషశయ్య మీద పవళించిన విష్ణుమూర్తిని పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి అనంతాసనం అని పేరు.
 
 ఎలా చేయాలి?
 నేల మీద ఎడమవైపు తిరిగి పడుకుని ఎడమ అరచేతిలో తలను ఉంచి విశ్రమించాలి. కుడిచేతిని కుడివైపు శరీరం పైన తిన్నగా(ఫొటోలో ఉన్నట్లు) ఉంచాలి.
 
 శ్వాస పూర్తిగా తీసుకుని కుడికాలిని నిటారుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. కుడిచేతిని పైకి లేపి కుడికాలి వేళ్లను చేతితో పట్టుకోవాలి. ఎడమకాలిని చక్కగా నేల మీద చాచి ఉంచాలి.
 
 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ వైపు కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 మోకాళ్లు, తొడలు, భుజాలు, మెడ కండరాలు శక్తిమంతం అవుతాయి.
 
 శరీరానికి రెండువైపులా ఉన్న కొవ్వు తొలగిపోయి నడుము సన్నబడుతుంది.
   రుతుక్రమ సమస్యలు, మలబద్దకం తొలగిపోతాయి.
 
 శ్వాసకోశ వ్యవస్థ శక్తిమంతం అవుతుంది.
 
 జాగ్రత్త!
 స్పాండిలోసిస్ ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, 
 నేషనల్ యోగా చాంపియన్

పరిఘాసనం యోగా

Sakshi | Updated: July 23, 2013 02:58 (IST)
పరిఘాసనం యోగా
హైదరాబాద్‌ :
ఇలా చేయాలి!
 ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అంటే... రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అరచేతులను తొడల మీద బోర్లించాలి. ఈ స్థితిలో రెండు మడమల మీద పిరుదులు ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి.
 
 దేహాన్ని పైకి లేపి రెండు మోకాళ్ల మీద నిలబడి, చేతులను శరీరానికి ఇరువైపులా (ఫొటోలో ఉన్నట్లు) ఉంచాలి.
 
 కుడికాలిని (మోకాలు వంచకుండా) వీలైనంతగా చాపాలి. ఎడమచేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో అరచేయి లోపలికి చూస్తుండాలి. 
 
 దీర్ఘంగా శ్వాస తీసుకుని నిదానంగా వదులుతూ దేహాన్ని వీలయినంత వరకు కుడివైపుకి వంచాలి. ఈ స్థితిలో ఎడమ చేతికి- తలకు మధ్య ఖాళీ లేకుండా చూసుకోవాలి.
 
 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా రెండవ వైపు కూడా చేయాలి. ప్రతిరోజూ ఇదే క్రమాన్ని మూడు లేదా ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 శరీరానికి ఉన్న కొవ్వు తొలగిపోవడంతో చక్కటి దేహాకృతి ఏర్పడుతుంది.
 
 శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
 
 తొడలకు ఉన్న కొవ్వు కరిగిపోతుంది. నడిచినప్పుడు తొడలు ఒరుసుకుపోతున్న వాళ్లకు ఈ ఆసనం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
 కాళ్లు, చేతులు, భుజాలు, మోకాళ్లు, మెడ కండరాలు శక్తిమంతం అవుతాయి.
 
 చేయకూడనివాళ్ళు
 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు
 
 స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు 
 
 స్థూలకాయులు... వీరంతా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, 
 నేషనల్ యోగా చాంపియన్
 
 ఫొటోలు: శివ మల్లాల

సుప్తవజ్రాసనం

తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది

Sakshi | Updated: July 30, 2013 02:59 (IST)
తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది
హైదరాబాద్‌ :
నేల మీద పడుకుని వజ్రాసనాన్ని ఆచరించే స్థితిని సుప్తవజ్రాసనం అంటారు.
 
 ఇలా చేయాలి
 ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అదెలాగంటే... రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అరచేతులను తొడలమీద బోర్లించాలి. ఈ స్థితిలో రెండు మడమల మీద పిరుదులు ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి.
 
 ఇప్పుడు నిదానంగా వెనక్కి వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత ఒకటి నేల మీద ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో రెండు పాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి.
 
 రెండు మోచేతుల సహాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండు చేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్ల మధ్య నాలుగు వేళ్ల ఖాళీ ఉండాలి. పిరుదులు రెండు మడమల మీద ఆని ఉండాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మోచేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. 
 
 ఇలా ప్రతిరోజూ మూడునుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది. 
 ఆస్తమా, బ్యాక్‌పెయిన్ నుంచి ఉపశమనాన్నిస్తుంది.
 మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
 థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది.
 గొంతు సమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది.
 
 జాగ్రత్తలు
 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు చేయకూడదు.
 
 అధిక బరువు ఉన్నవాళ్లు, కొత్తగా చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత 
 నేషనల్ యోగా చాంపియన్

సుప్త వీరాసనం

Sakshi | Updated: August 05, 2013 23:29 (IST)
సుప్త వీరాసనం
హైదరాబాద్ :
వీరాసనంలో కూర్చుని వెల్లకిలా పడుకునే భంగిమను సుప్తవీరాసనం అంటారు.
 
 ఇలా చేయాలి
 ముందుగా వీరాసనంలో కూర్చోవాలి... అంటే మోకాళ్లు మడిచి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవాలి. ఈ స్థితిలో అరికాళ్లు దేహానికి రెండు వైపులా ఆకాశాన్ని చూస్తుండాలి. అరచేతులను తొడల మీద బోర్లించాలి. వెన్నెముక నిటారుగా ఉంచి దృష్టిని నేరుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. దీనిని వీరాసనం అంటారు.
 
 ఇప్పుడు నిదానంగా వెనుకకు వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత మరొకటిగా నేల మీద ఆనించాలి. ఈ స్థితిలో రెండుపాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి.
 
 రెండు మోచేతుల సాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండుచేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో పూర్తి శరీరం నేలను తాకుతూ ఉంటుంది. పాదాలు శరీరానికి ఆనుకుని ఉంటాయి, మడమలు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటాయి. శ్వాస సాధారణంగా తీసుకుంటూ వదలాలి. 
 
 ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సాయంతో దేహాన్ని పైకిలేపుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. 
 
 ఉపయోగాలు
 తొడల మీద ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
 
 మోకాళ్లు, తొడలు శక్తిమంతం అవుతాయి.
 
 ఆస్త్మా, బ్యాక్ పెయిన్, థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి.
 
 గొంతు సమస్యలు తగ్గి స్వరం బాగుంటుంది.
 
 జాగ్రత్తలు
 మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు, స్థూలకాయులు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.
 
 మొదటిసారి చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
 
 
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,  హైదరాబాద్
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్

పరివృత జానుశిరాసనం

Sakshi | Updated: August 13, 2013 04:51 (IST)
పరివృత జానుశిరాసనం
హైదరాబాద్‌ : నిర్వచనం: ‘తిప్పబడిన లేదా మెలివేయబడిన జానుశిరాసనం అని అర్థం. ఈ ఆసనంలో ముఖాన్ని పక్కకు తిప్పి చూడాలి.

చేసే విధానం

రెండుకాళ్లను చాపి వెన్నెముక నిటారుగా ఉంచుకుని సమస్థితిలో కూర్చోవాలి. తర్వాత ఎడమకాలిని మోకాలి వద్ద మడిచి ఎడమ పాదాన్ని కుడికాలి తొడ దిగువ భాగాన ఆనించాలి.
 
 కుడిచేత్తో కుడికాలి వేళ్లను పట్టుకోవాలి, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ చేయి చెవిని తాకుతుండాలి. శరీరాన్ని, తలను కొద్దిగా ఎడమవైపుకి తిప్పాలి.

 ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకుని శరీరాన్ని పైకి సాగదీసినట్లు లాగి, శ్వాస వదులుతూ కుడివైపుకి వంగాలి. ఈ స్థితిలో కుడి మోచేయి నేలను తాకాలి. ఎడమ చేతితో కుడికాలి వేళ్లను పట్టుకోవాలి.

 ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.

 ఇలాగే కుడికాలిని మడిచి  కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదు సార్లు చేయాలి.

 ఫొటోలు: శివ మల్లాల
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్

మార్జాలాసనం

Sakshi | Updated: August 19, 2013 23:21 (IST)
మార్జాలాసనం
హైదరాబాద్‌ : నిర్వచనం: మార్జాలం అంటే పిల్లి. కోపంగా ఉన్నప్పుడు బుస్సుమని వీపును పొంగిస్తుంది, తర్వాత యథాస్థితికి వస్తుంది పిల్లి. అలాంటి కదలికలు ఈ ఆసనంలో ఉండడం వలన దీనిని మార్జాలాసనం అంటారు.

 ఎలా చేయాలి?
 రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లాపడుకుని (ఫొటోలో ఉన్నట్లు)విశ్రాంతి స్థితిలో ఉండాలి.
   
 రెండు అరచేతులను నేల మీద ఉంచి మోకాళ్ల మీద లేవాలి. ఈ స్థితిలో చేతులు(మోచేతులు వంచకుండా) నిటారుగా ఉండాలి.
   
 ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వీపును కిందకు వంచి తలను పెకైత్తాలి. (ఫొటోను గమనించండి). తర్వాత శ్వాస వదులుతూ వీపును పైకి లేపుతూ తలను కిందికి వంచి నాభిని చూడాలి.
   
 ఇలా రోజూ పదిసార్లు చేసిన తర్వాత బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి.

 ఉపయోగాలు
 ప్రసవం తర్వాత ఈ ఆసనాన్ని చేయడం వల్ల దేహం పూర్వపు ఆకృతిని, దారుఢ్యాన్ని సంతరించుకుంటుంది.
   
 ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చక్కటి వ్యాయామం అందడం వల్ల రుతుసంబంధ సమస్యలు తొలగిపోతాయి.
   
 వెన్నెముక సరళతరమవుతుంది. భుజాలు, మోచేతులు, మణికట్టు శక్తిమంతం అవుతాయి.
   
 ఆస్తమా, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
   
 అజీర్తి, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయి.
   
 నడుము కండరాలు శక్తిమంతం అవుతాయి. నడుమునొప్పి ప్రారంభదశలో ఉన్నవారు ఈ ఆసనాన్ని సాధన చేస్తే నొప్పి తగ్గుతుంది.

 వీళ్ళు చేయకూడదు

 వెన్నుపూసల సమస్య ఉన్నవాళ్లు, స్పాండిలోసిస్ ఉన్నవాళ్లు చేయకూడదు.
   
 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్నవాళ్లు నిపుణుల సూచనమేరకు చేయాలి.

 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్

 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

యోగ ముద్రాసనం

Sakshi | Updated: August 26, 2013 23:22 (IST)
యోగ ముద్రాసనం
హైదరాబాద్ :  ‘యోగ’ అంటే కలయిక అని అర్థం. ముద్ర అంటే హావభావాలు. ఈ ఆసన సాధన... హావభావాలు అంతర్ముఖమై అంతరాత్మతో కలవడానికి తోడ్పడుతుంది. అందువలన దీనిని యోగముద్ర లేదా యోగముద్రాసనం అంటారు.
 
 ఎలా చేయాలి?
 పద్మాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. తర్వాత చేతులను వెనక్కి తీసుకుని వేళ్లకు కలిపి (ఫింగర్స్ ఇంటర్‌లాక్)పట్టుకోవాలి.
   
 ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగి మెల్లగా శ్వాసను వదులుతూ ముందుకు వంగాలి. రెండు చేతులను వీలైనంత నిటారుగా తీసుకురావాలి. ఫొటోను గమనించండి.
   
 ఈ స్థితిలో గడ్డం నేలను తాకాలి, పిరుదులు నేల మీద నుంచి పైకి లేవకూడదు. పాదాలు పొట్టభాగాన్ని తాకుతుంటాయి.
   
 ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా రోజుకి మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

 ఉపయోగాలు

 పద్మాసనంలో ఉండే ఫలితాలన్నీ ఈ ఆసనంలో కూడా ఉంటాయి.

 పొట్టలోని అన్ని భాగాలకూ మంచి వ్యాయామం అందుతుంది.

 జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.

 లివర్, ప్లీహం పనితీరు మెరుగవుతుంది, వెన్నెముక శక్తిమంతం అవుతుంది.

 ఈ ఆసనం బ్రహ్మచర్యానికి ఉపయోగపడుతుంది. అనేక రకాల లైంగిక వ్యాధులను తొలగిస్తుంది.

 మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు కండరాలు శక్తిమంతం అవుతాయి.

 పార్శ్వపు నొప్పి, తలనొప్పి, ఒత్తిడి తొలగిపోతాయి. ముఖంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరగడంతో కండరాలు చైతన్యవంతం అవుతాయి. ముఖం కాంతిమంతం అవుతుంది.

 జాగ్రత్తలు
 బ్యాక్ పెయిన్, హైబీపీ, సయాటికా, హెర్నియా, స్పాండిలోసిస్ ఉన్నవాళ్లు చేయకూడదు.

 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు కూడా చేయరాదు.

 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్

 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

 

ఆకర్ణ ధనురాసనం

Sakshi | Updated: September 17, 2013 00:29 (IST)
ఆకర్ణ ధనురాసనం
హైదరాబాద్ :  కర్ణం అంటే చెవి. ధనుర్ అంటే ధనుస్సు. కాలిని చేతితో చెవి దగ్గరకు లాగినట్లు పట్టుకున్నప్పుడు ఆ భంగిమ... బాణాన్ని ఎక్కు పెట్టిన ధనుస్సును పోలి ఉంటుంది. అందుకే దీనిని ఆకర్ణ ధనురాసనం అంటారు.

 ఎలా చేయాలంటే!

 ముందుగా రెండుకాళ్లను చాపి కూర్చోవాలి. కుడిచేతితో ఎడమకాలి బొటనవేలును, ఎడమచేతితో కుడికాలి బొటనవేలును పట్టుకోవాలి.

 కుడిచేతితో ఎడమకాలి మడమను తీసుకువచ్చి కుడికాలి తొడ మీద ఉంచాలి.

శ్వాస తీసుకుని (శ్వాస వదలకుండా ఆపి ఉంచాలి) కుడిచేతితో ఎడమకాలి బొటనవేలును కుడిచెవి దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో కుడిమోకాలు నేల మీద నుంచి పైకి లేవకూడదు. ఎడమ చేయి కుడికాలి బొటన వేలును పట్టుకునే ఉండాలి. వెన్నెముకను వీలైనంత నిటారుగా ఉంచాలి.

  ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా యథాస్థితిలోకి రావాలి.

  ఇలాగే రెండవకాలితోనూ చేయాలి. అప్పుడు ఆకర్ణ ధనురాసనం ఒక రౌండ్ పూర్తయినట్లు. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

 ఉపయోగాలు!
 కాళ్ల కండరాలు సాగినట్లయి సరళతరం కావడంతోపాటు, శక్తిమంతం అవుతాయి కూడ.

 భుజాలు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు శక్తిమంతం అవుతాయి.

 తుంటిభాగంలో చిన్న చిన్న లోపాలు తొలగిపోతాయి.

 పొట్టకండరాల మీద తగినంత ఒత్తిడి కలిగి శక్తిమంతం అవుతాయి.

 మలబద్దకం తొలగిపోతుంది. పొట్టకు సంబంధించిన ఇతర చిన్నచిన్న సమస్యలు పోతాయి.

 జాగ్రత్తలు
 మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, భుజాల సమస్య లు ఉన్నవాళ్లు చేయకూడదు.

 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్


 ఫొటోలు: శివ మల్లాల

యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు

యోగాకు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -సనత్ కుమార్, రావులపాలెం.
 భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగాభ్యాసాన్ని మించిన వైద్యం లేదన్న విషయం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో యోగా ప్రాక్టీస్ చేసేవారు పెరిగారు. ఇది ఒక కెరీర్‌గా మారింది. దీంతో యోగా ట్రైనర్లకు డిమాండ్ ఏర్పడింది. వృత్తి పట్ల నిబద్ధత, సహనం, ఆరోగ్యం కోసం వచ్చే వారి పట్ల వ్యవహరించే తీరుపైనే కెరీర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక మాదిరి పట్టణాలు, పెద్ద నగరాల్లో యోగా ట్రైనింగ్ సెంటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటువంటి ప్రదేశాల్లో ప్రారంభంలో ట్రైనర్లు నెలకు రూ.20,000 నుంచి రూ. 25,000 వరకు ఆదాయం పొందుతున్నారు. మిడిల్ లెవెల్ ప్రొఫెషనల్స్ నెలకు రూ.40 వేల నుంచి రూ. 50 వేలు, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

 యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు:
 శ్వాస (SVYASA) యూనివర్సిటీ-బెంగళూరు. ఈ యూనివర్సిటీ యోగాకు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులతోపాటు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులను కూడా అందిస్తుంది
 వివరాలకు: www.svyasa.org
 మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogamdniy.nic.in
 యోగా లైఫ్- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogalife.org
 శివానంద యోగ వేదాంత సెంటర్స్.
 వివరాలకు: www.sivananda.org
 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.ccryn.org

భుజంగాసనం

Sakshi | Updated: September 24, 2013 00:16 (IST)
భుజంగాసనం
హైదరాబాద్ : భుజంగం అంటే సర్పం. ఈ ఆసనం వేసినప్పుడు ఛాతీ, మెడ, తల పెకైత్తి ఉండడంతో ఈ భంగిమ పడగ విప్పిన పామును పోలి ఉంటుంది. కాబట్టి దీనిని భుజంగాసనం అంటారు. ఇదే ఆసనాన్ని కొద్దిపాటి మార్పులతో నాలుగు రకాలుగా సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వాటిలో ఒక పద్ధతి.

ఎలా చేయాలి?
బోర్లా పడుకుని రెండు చేతులను (ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి. ఫొటోని గమనించండి) గడ్డం కింద ఉంచుకుని కొద్ది క్షణాలు విశ్రాంతి స్థితిలో ఉండాలి.

బోర్లించి ఉంచిన అరచేతులను ఛాతీ కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని దేహం బరువుని రెండు చేతుల మీద మోపుతూ తలను పైకి లేపాలి.

ఇలానే ఉండి, నాభి దిగువ ప్రాంతం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా (మోచేతుల దగ్గర వంచకుండా) ఉండాలి, చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్లు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మనసును వీపు దిగువ భాగం మీద కేంద్రీకరించాలి.

ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఉపయోగాలు
వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

 థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయవుతాయి. స్వరం సరళతరమవుతుంది కాబట్టి గాయకులు, న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఈ ఆసనం బాగా దోహదం చేస్తుంది.

 పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.

 చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది.

రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి.

 జాగ్రత్త
 హెర్నియా ఉన్నవాళ్లు, భుజాలు అరిగిపోయిన వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.

 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత
 నేషనల్ యోగా చాంపియన్


 ఫొటోలు: శివ మల్లాల


 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

పరీవృత త్రికోణాసనం

Sakshi | Updated: October 01, 2013 00:59 (IST)
పరీవృత త్రికోణాసనం
హైదరాబాద్ : ఈ ఆసన భంగిమ నడుము వద్ద మెలి తిరిగి ఉండి త్రికోణాసనభంగిమను పోలి ఉంటుంది. అందుకే దీనిని పరీవృత త్రికోణాసనం అంటారు.

 ఎలా చేయాలి?
 పాదాలు దగ్గరగా ఉంచి సమస్థితిలో నిలబడాలి.

 పాదాలను కొంచెం దూరంగా ఉంచి రెండు చేతులను పక్కలకు చాపాలి. చేతులు చాచినప్పుడు భుజాలకు సమాంతరంగా ఉండాలి.

 ఇప్పుడు శ్వాస పూర్తిగా తీసుకుని, నిదానంగా వదులుతూ, ముందుకు వంగి, ఎడమ చేతిని కుడిపాదం చివరన ఉంచాలి. ఛాతీ పూర్తిగా కుడివైపుకి తిరిగి ఉండాలి. ఈ స్థితిలో మోకాళ్లు వంచకూడదు. కుడిచేయి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా పైకి ఉండాలి. తలతిప్పి కుడి అరచేతిని చూస్తుండాలి.

 ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అలాగే రెండవవైపు కూడా చేయాలి. కుడి, ఎడమలు కలిపి 8-10 సార్లు చేసి విశ్రాంతి తీసుకోవాలి.

 ఉపయోగాలు
 నడుము వద్ద కొవ్వు తొలగిపోవడంతో దేహాకృతి చక్కగా తయారవుతుంది.
   
 భుజాలు, మోకాళ్లు శక్తిమంతం అవుతాయి.
   
 శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి.
   
 మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
   
 కడుపు భాగంలో కదలికల వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
   
 పిరుదుల దగ్గర చేరిన అదనపు కొవ్వు తగ్గుతుంది. నడుము దగ్గర కీళ్లు సరళతరమవుతాయి.

 ఎవరెవరు చేయకూడదు
 వెన్ను నొప్పి ఉన్న వాళ్లు

 స్పాండిలోసిస్ ఉన్న వాళ్లు, హైబీపీతో బాధపడుతున్న వాళ్లు

 భుజాలు అరిగిపోయిన వాళ్లు

 బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్లు

 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు,
 సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్


 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత,
 నేషనల్ యోగా చాంపియన్
 ఫొటోలు: శివ మల్లాల

బద్ధ పద్మాసనం

Sakshi | Updated: October 22, 2013 00:00 (IST)
బద్ధ పద్మాసనం
Hyderabad : బద్ధ అనగా బద్ధుడు లేదా బంధింపబడిన అని అర్థం. అంటే మనసు పద్మాసనంలో బంధింపబడి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని బద్ధ పద్మాసనం అంటారు.

 ఎలా చేయాలి?
 పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచుకుని రెండు చేతులు తొడలమీద ఉంచుకోవాలి.

 ఇప్పుడు కుడిచేతిని వెనుకకు మడిచి కుడిచేతి వేళ్లతో ఎడమ తొడ మీద ఉన్న కుడికాలి బొటన వేలిని పట్టుకోవాలి.

 అలాగే ఎడమ చేతిని వెనుకకు మడిచి కుడిచేతి మీదుగా ఎడమ చేతి వేళ్లతో కుడి తొడపై ఉన్న ఎడమ కాలి తబొటనవేలిని పట్టుకోవాలి.

 ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి యథాస్థితికి రావాలి.

 ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

 ఉపయోగాలు
 ఛాతీ విశాలంగా మారుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
   
 పద్మాసనంలో ఉండే ఫలితాలు అన్నీ ఇందులోనూ ఉంటాయి.
   
 భుజాలకు, చేతులకు, మోకాళ్లకు బలం చేకూరుతుంది.

 వెన్నెముక నిటారుగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.
   
 ప్రాణవాయువు చక్కగా ప్రసరించి ధ్యానానికి తోడ్పడుతుంది.
   
 నడుము సన్నబడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
   
 ఇంద్రియ నిగ్రహం పెరిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

 జాగ్రత్తలు
 భుజాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు, మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్నవాళ్లు, తొడల మీద కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత,
 నేషనల్ యోగా చాంపియన్
 ఫొటోలు: శివ మల్లాల


 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

మాతృగర్భాసనం

Sakshi | Updated: October 28, 2013 23:56 (IST)
హైదరాబాద్ : ఈ ఆసనం వేసినప్పుడు దేహం తల్లిగర్భంలోని పిండం ఆకృతిలో కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మాతృగర్భాసనం అంటారు.

 ఎలా చేయాలి?
 పద్మాసన స్థితిలో కూర్చుని, రెండు అరచేతులు మోకాళ్లమీద ఉంచాలి. ఈ స్థితిలో వెన్నెముకను నిటారుగా ఉండాలి.
   
 ఇప్పుడు రెండు చేతులను రెండు కాళ్ల మధ్యకు చొప్పించి (ఫొటోలో కనిపిస్తున్నట్లు) అరచేతులను నేలకు ఆనించాలి.
   
 ఇప్పుడు రెండు చేతులను ఒకదాని తర్వాత మరొకటి వంచుతూ అరచేతులను చెంపలకు ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలన్న విషయాన్ని మరచిపోకూడదు. దృష్టి నేరుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు పైకి లేచి ఉంటాయి. శరీరం బరువు పిరుదుల మీద పడుతుంది. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి.
    
ఇలా మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.

 ఉపయోగాలు
 జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది, మలబద్దకం తొలగిపోతుంది.

 నరాల బలహీనత తగ్గుతుంది.

 ఆందోళన, ఆవేశం, కోపం తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

 ఏకాగ్రత పెరుగుతుంది.

 పొట్ట తగ్గుతుంది. మోకాళ్లు, చేతులు శక్తిమంతం అవుతాయి.

 పిరుదులలో చేరిన కొవ్వు కరుగుతుంది. రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.

 జాగ్రత్తలు
 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు

 అధికబరువు ఉన్న వాళ్లు, తొడలలో కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లు, భుజాల
 సమస్యలతో బాధపడుతున్నవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్


 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

Chakraasanam

చక్రాసనం

Sakshi | Updated: November 19, 2013 00:46 (IST)
నిర్వచనం: ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి చక్రంలా కనిపిస్తుంది. అందుకే ఇది చక్రాసనంఅయింది.

 చేసే విధానం
 ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులు ఇరువైపుల ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.

 తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండుపాదాలను పిరుదుల వద్దకు తీసుకోవాలి. మడమలు పిరుదులకు ఆనించి ఉంచాలి.

 ఇప్పుడు రెండు అరచేతులను తలకిరువైపుల నేల పైన ఉంచాలి.

 శ్వాస పూర్తిగా తీసుకొని శరీరబరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి శరీరాన్ని పైకి లేపాలి.

 ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తలక్రిందకు వ్రేలాడబడి ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు వంగకుండా అరచేతులు, పాదాలు నేలను తాకి ఉంటాయి.

 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.

 ప్రతిరోజు ‘3’ సార్లు చేయాలి.

 ఉపయోగాలు
 వెన్నునొప్పి తొలగిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు పోతాయి.

 చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తిమంతం అవుతాయి.

 పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి.

 అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్దకం పోతాయి.

 రుతుక్రమ సమస్యలు పోతాయి.

 తొడలపై కొవ్వు కరుగుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది.

 వెన్ను సరళతరమవుతుంది.

 చేయకూడనివాళ్ళు
 హైబీపీ, మైగ్రేన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు ఉన్న వారు చేయకూడదు.

 అధికబరువు ఉన్నవారు, మోకాళ్ల నొప్పులు, భుజముల నొప్పులు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

 మోడల్: అంజు రిషిత
 ఫొటోలు: శివ మల్లాల


 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు
 సప్తరుషి యోగవిద్యాకేంద్రం
 హైదరాబాద్

Thursday, 14 November 2013

షుగర్ వ్యాధి రావటానికి గల కారణాలు

చక్కర వ్యాధి ని రాకుండా చెయ్య టానికి షుగర్ వ్యాధి రావటానికి గల కారణాలు
చాలా వరకు మన చేతుల్లో లేవు . వచ్చిన పిదప కంట్రోల్ లో పెట్టు కోవటమే మార్గం , తల్లి తండ్రికి ఉంటె పిల్లలకి వచ్చే అవకాశం ఉంది . అందుచేత అట్లాంటి రిస్క్ ఫాక్టర్ ఉన్న వారు 20 ఏళ్ళు దాటినా వెంటనే , ప్రీ డయాబెటిస్ టెస్ట్ చేయించు కోవాలి
కంట్రోల్ లో ఉంచు కోవాలంటే ఏం చెయ్యాలి ?
డాక్టర్ గారు చెప్పినట్లు గా మందులు వాడాలి . వారు సూచించిన విధంగా టెస్ట్ లు చేయించు కోవాలి
డయాబెటిస్ వస్తే మిగిలిన శరీరం లో ని భాగాలన్నీ నెమ్మదిగా నాశనం అవుతాయి . అందుచేత షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసు కో రాదు
ప్రతి రోజు , డాక్టర్ సూచించినట్లు గా శరీరం లో ని బరువు , ఎత్తు ఆధారంగా ఎన్ని calories ఫుడ్ అవసరమో అంతే తీసుకోవాలి

1. . ప్రతి రోజు ఏదో ఒక పండు , తినాలి . అంటే జామకాయ, రేగి పండు, మితంగా బొప్పాయి ముక్కలు, వాటర్ మెలాన్ , పుచ్చకాయ మొదలయినవి
2 అను నిత్యం వాకింగ్ చెయ్యాలి . ఈ వాకింగ్ ఎంత చెయ్యాలి అన్నది పేషెంట్ పేషెంట్ కి మారుతుంది . డాక్టర్ గారు సూచిస్తారు
3. తినే ఆహరం ఒక్క సారే తినకుండా మితంగా రోజుకి 5 లేక 6 సార్లు తీసుకోవాలి ఆహారం లో ఆకు కూరలు, ఫైబర్ , ప్రోటీన్ లు ఎక్కువగా ఉన్నవి తీసు కోవాలి . దుమ్పకూరలు ను తిన గూడదు
4. టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజక్షన్ డాక్టర్ చెప్పినట్లు టైం కి తీసు కోవాలి
5. ప్రతి 6 నెలలకి ఒక సారి ఈ టెస్ట్ లు చేయించు కోవాలి
అ. లిపిడ్ ప్రొఫైల్
ఆ glyco syllated హేమో గ్లోబిన్ . ఈ టెస్ట్ వలన గత 3 నెలలు గా షుగర్ అదుపు లో ఉందీ లేనిది తెలుపుతుంది
ఇ పూర్తీ మూత్ర పరీక్షా
ఈ urine ఫర్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్
ఉ కళ్ళు, కాళ్ళు చెక్ అప్ .
ఊ మూత్ర పిండాలు పని చేసే విధానం టెస్ట్ ( Renal function test )
రు ఎక్కువగా మానసిక వత్తిడికి లోను కాగూడదు

LadyFinger for Diabetes


అవయవాల శుభ్రం చక్ర సౌందర్యం

మన శరీరం ఏడు చక్రాల సమాహారం. ఈ చక్రాలన్నీ అవయవాలను శుభ్రం చేసి.. మనల్ని నిత్య ఆరోగ్యవంతులుగా తయారుచేస్తాయి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని కింద సూచించిన చక్రాల మీద కాసేపు మనసును లగ్నం చేయండి. అదే ఈ వారం యోగా..

మూలాధార చక్రం : శరీరంలోని వెన్నెముక కింది భాగంలో ఉంటుంది మూలాధార చక్రం. కళ్లు మూసుకుని ఆ ప్రదేశంలో ఒక చక్రం ఉన్నట్లు ఊహించుకోవాలి. దాని మీదే దృష్టిపెట్టి మూడు నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఈ సమయంలో సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మల మూత్రాలు సాఫీగా సాగుతాయి.
స్వాధిష్టాన చక్రం : వెన్నెముక కింది భాగం - అంటే బొడ్డుకి కొంచెం కింది స్థానంలో ఉంటుందిఈ చక్రం. దీని మీద దృష్టి నిలపడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
మణిపూరక చక్రం : వెన్నెముక దగ్గర బొడ్డుకి వెనుక భాగంలో ఉంటుంది ఈ చక్రం. ఈ భాగం మీద మనసును ఏకీకృతం చేస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. క్లోమగ్రంథి చక్కగా పనిచేస్తుంది. మధుమేహ సమస్యలను రాకుండా కాపాడటం దీని ముఖ్య లక్షణం.
అనాహత లేక హృదయ చక్రం : గుండెకు వెనుక భాగాన ఉండే ఈ చక్రం అత్యంత కీలకమైనది. దీని మీద దృష్టి పెట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. రెగ్యులర్‌గా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల హృద్రోగ సమస్యలు రావు. సున్నితమైన మనస్తత్వం అలవడుతుంది.
విశుద్ధి చక్రం : కంఠానికి వెనుక భాగంలోని ఈ చక్రం.. థైరాయిడ్ సమస్యల్ని రానివ్వదు. స్వరపేటిక సమస్యలు తగ్గుతాయి. గొంతు సంబంధిత జబ్బులు రావు.
ఆజ్ఞా చక్రం : రెండు కనుబొమల మధ్య భాగంలో ఉండే చక్రం ఇది. ఇప్పటి వరకు చెప్పుకున్న అయిదు చక్రాలు ఆరోగ్యానికి సంబంధించినవైతే ఈ రెండు చక్రాలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించినవి. మిగతా అన్ని చక్రాలను ఆజ్ఞాపించే అధికారం దీని సొంతం.
సహస్తార చక్రం : శిరస్సు మధ్య భాగంలో ఉంటుందీ చక్రం. మనసును సమతుల్య పరుస్తుంది. భావోద్వేగాలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
Courtesy-Andhrajyothy

Benifits of Banana peel

Courtesy-Navya

Wednesday, 13 November 2013

పూర్ణ భుజంగాసనం

Sakshi | Updated: November 12, 2013 00:05 (IST)
హైదరాబాద్ : భుజంగం అంటే పాము. పడగెత్తిన పాము పూర్తిగా వెనుకకు వంగిన స్థితిని లేదా భుజంగాసనం సంపూర్ణ స్థితిలో వేయడం వలన దీనిని పూర్ణ భుజంగాసనం అంటారు.

 చేసే విధానం
 మొదట రెండు చేతులను గడ్డం కింద ఉంచి, బోర్లా పడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి.
రెండు అరచేతులను ఛాతీకి దగ్గరగా నేలపై ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలనుంచి నాభి వరకు పైకి తీసుకురావాలి.
   
రెండు కాళ్లనూ మోకాళ్ల వద్ద వెనుకకు వంచి అరిపాదాలను నుదురు భాగానికి తాకించి, ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి.
   
 ఈ ఆసనాన్ని రోజుకు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.

 జాగ్రత్తలు!
పూర్ణ భుజంగాసనం వేయడం కొంత కష్టమే. ఎక్కువ సాధన ఉన్నవారు మాత్రం సులువుగా చేయగలరు. ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం మంచిది.

 ఉపయోగాలు
వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గుతుంది. ఛాతీ విశాలం అవుతంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరం సరళతరమవుతుంది.
   
 పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
   
 చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది.
   
 రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి.
   
 శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది.

 మోడల్: అంజు రిషిత


  బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు
 సప్తరుషి యోగవిద్యాకేంద్రం
 హైదరాబాద్


 ఫొటోలు: శివ మల్లాల

Wednesday, 6 November 2013

Dialysis @ Gandhi Hospital Hyderabad

Courtesy-Eenadu

రక్తపోటును నియంత్రించేందుకు ఆహార నియమాలు

అయితే రక్తపోటును నియంత్రించేందుకు ఆహార నియమాలను పాటిస్తే కాస్త ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు వైద్యులు.
ఉప్పు: ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పువాడకం తగ్గించాలి. రోజుకు 5గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ప్రాసెస్డ్, ప్యాకేజీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్, క్యాన్స్ పదార్థాలు తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికంగా చేస్తుంది.

పొటాషియం: ఇది బీపీని తగ్గిస్తుంది. బీన్స్, బఠాణీలు, నట్స్, పాలకూర, క్యాబేజీ, కొత్తిమీర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమలా, నారింజ, నిమ్మ వంటి పండ్లలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
కొవ్వు పదార్థాలు: వీటివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి బీపీ ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. అందుకే వాటి వాడకం క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. పచ్చళ్లు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటినీ తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.

ఆల్కహాలు: ఈ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానెయ్యాలి. లేదా పరిమితిలో ఉండాలి.
పొగ తాగడం: పొగతాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. తద్వారా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆహారంలో మార్పులు: ఎక్కువ పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయగూరలు, ఆకు కూరలు, పప్పులు వాడాలి. రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి. సాస్‌లు, ఊరగాయలు పూర్తిగా తగ్గించాలి.
Courtesy-Andhrajyothy

గుమ్మడి గింజలు తింటే .... జీవితకాలం పెరుగుతుందట!

మీలో ఉన్న అన్ని ఆరోగ్యసమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషదం గుమ్మడి, గుమ్మడి గింజలు చాలా మంది. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటువంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకొన్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే, ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులోపుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.

ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.

ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయమేమిటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి, గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.
Courtesy-Aayuraarogyaalu