చిన్నాపెద్దా అని లేకుండా జీవితంలో అనారోగ్యం దాదాపు అందరినీ వెంటాడుతోంది. జీవనశైలిని మార్చుకోవడం, మంచి ఆహారనియమాలను పాటించడంతోపాటు రోజూ అరగంటసేపైనా యోగాసనాలు వెయ్యడం వల్ల శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటాం. మేలు చేసే అలాంటి ఆసనాలు కొన్నింటిని ఈవారం నుంచి యోగా శిక్షకురాలు కూచిపూడి వెంకటలక్ష్మి పరిచయం చేస్తున్నారు.
ఎంతోమంది చక్కెర వ్యాధి బారిన పడుతున్నారు. వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం సరే, అసలు రాకుండానే జాగ్రత్త పడొచ్చు కదా. దీనికి ఆహార నియమాలతో పాటు కొన్ని యోగాసనాలు కూడా మేలు చేస్తాయి. వాటిలో అర్థ మత్స్యేంద్రాసనం, నౌకాసనం ముఖ్యమైనవి. వాటిని వెయ్యడం ఎలాగో తెలుసుకుందాం.
అర్ధ మత్స్యేంద్రాసనం
చాప మీద కూర్చుని కుడికాలిని మడిచి ఎడమకాలిని కుడికాలి మీద నుంచి తీసుకొచ్చి నిలబెట్టాలి. కుడిచేతిని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఎడమకాలి మడమ దగ్గర పట్టుకోవాలి. ఎడమచేతిని నడుంమీద పెట్టి గాలి తీసుకుంటూ తలను నెమ్మదిగా ఎడమ భుజం మీదుగా వెనక్కి చూస్తున్నట్లు పెట్టాలి. రెండు నిమిషాలు గడిచాక నెమ్మదిగా శ్వాస వదులుతూ తలను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలి. తర్వాత కాళ్లు, చేతులను యథాస్థానంలోకి తీసుకురావాలి. ఇలాగే ఎడమవైపు కూడా చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత విశ్రాంతిగా కూర్చోవాలి.
గమనిక : శ్వాస ఎక్కువసేపు బంధించి ఉంచలేనివారు, మామూలుగా గాలి తీసుకుని వదిలేస్తూ చేయవచ్చు. కొన్నిరోజుల సాధన ద్వారా శ్వాసను బంధించడం సాధ్యమవుతుంది.
నౌకాసనం
ఈ ఆసనం వేస్తున్నప్పుడు మనిషి శరీరం పడవ ఆకృతిలోకి వస్తుంది. అందుకే దీనికి నౌకాసనం అని పేరొచ్చింది. చాపమీద వెల్లకిలా పడుకుని చేతులను తల వెనక్కి పెట్టాలి. కాళ్లు రెండూ దగ్గరికి జరిపి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను మోకాళ్ల వరకూ తీసుకొచ్చి తల భాగం, కాళ్లు పైకి లేపాలి. ఈ స్థితిలో మన నడుము భాగం మాత్రం నేలకు ఆనుకుని, శరీరం నావ ఆకారంలో ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, గాలి వదులుతూ శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలి. ఇలా మూడు సార్లు చేసి తర్వాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు :
- పొట్ట దగ్గరున్న కండరాలు గట్టిపడతాయి.
- ఇన్సులిన్ సమంగా ఉత్పత్తి అయి గ్లూకోజ్ నిల్వలను అదుపులో ఉంచుతుంది.
- ఈ ఆసనాలు చెయ్యడం వల్ల పాంక్రియాస్ పనితీరు మెరుగయి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
- ప్రతిరోజూ సాధన ముఖ్యం - సాధన ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment