గ్యాస్ట్రిక్ సమస్యలతో... ఒక్కొక్కరివీ ఒక్కో రకమైన బాధలు. అందరికీ
చెప్పుకోలేని, నలుగురిలో తిరగలేని పరస్థితి బాధితులది. చికిత్స కోసం
చూద్దాం..చేద్దాం..అనేసరికే
పుణ్యకాలం కాస్తా ముగిసి పోతుంది. ఏది ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు మానసిక
ప్రశాంతతను దెబ్బతీసి సుఖమయ జీవితానికి ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే
కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ క్రమంగా ఆ సమస్య నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేయడమే ఉత్తమం అంటున్నారు వైద్యులు.
పేగుల్లో ప్రత్యేకించి ఏ వ్యాధీ లేకపోయినా వేధించే గ్యాస్ సమస్యను ఫంక్షనల్ లేదా నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటారు. మెదడులో ఉన్నట్టే పేగుల్లోనూ అంతే సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మనసు, మెదడుతో పాటుపేగుల మీద కూడా నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఏ తేడాలు వచ్చినా పేగుల కదలికలు, పనితీరు అస్తవ్యస్తం కావచ్చు. అందుకే కొన్నిసార్లు మరీ సున్నిత మనస్కుల్లోనూ, పరీక్షలకు వెళ్లబోతున్న వారిలోనూ ఆ డిస్పెప్సియా లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి.
పని ఒత్తిడితో పాటు ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తంగా ఉండే సాఫ్ట్‌వేర్ షిప్టు ఉద్యోగులు, శారీరక శ్రమ పెద్దగా లేని గృహిణులు... వీరిలోనూ ఈ సమస్య ఎక్కువే.
సహజంగా పేగుల్లో 100 ఎం.ఎల్. గ్యాస్ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ గ్యాస్ ఉత్పత్తి మరింత పెరిగి ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది.
జీర్ణ సమయంలో: మనం తిన్న ఆహారం పేగుల్లోని జీర్ణ రసాయనాలతో కలిసి...జీర్ణమయ్యే ప్రక్రియలో భాగంగా సహజంగానే కొంత గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా పీచు పదార్థాలను జీర్ణించుకునే సమయంలో ఎక్కువ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రక్తం నుంచి: మన రక్తంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులుంటాయి. పేగులకూ, రక్తంలోని ఈ వాయువులకూ మధ్య చర్య వల్ల కూడా పేగుల్లో గ్యాస్ పెరుగుతుంది. పేగుల్లో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటివి త్వరగా రక్తంలో కలిసిపోతాయి. కానీ మిథేన్ వంటివి రక్తంలో కలవకుండా ఉండిపోయి ఉబ్బరంగా తయారై చివరికి శరీరం నుంచి ఏదో విధంగా బయటకు వెళ్లిపోతాయి.
గాలి మింగటం వల్ల:
మాట్లాడుతున్నప్పుడు, వేగంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే గాలి కూడా మింగేస్తుంటాం. పొట్టలో గ్యాస్ పెరగటానికి, త్రేన్పులకు ఇలా గాలి ఎక్కువగా మింగుతుండటం కూడా ఒక కారణం. మానసిక ఒత్తిడికి లోనయ్యే పరీక్షలు, ఇంటర్వ్యూల వంటి సందర్భాల్లో అప్రయత్నంగానే గాలి మింగుతున్నట్టు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
లక్షణాలు:
-కడుపులో ఉబ్బరంగా ఉండటం
- త్రేన్పులు, అపాన వాయువులు
-ఆకలి మందగించటం
- అన్నహితవు లేకపోవడం
-కడుపునొప్పి
- బరువు తగ్గటం
- జ్వరం, వాంతులు
- మలంలో రక్తం పడటం
చికిత్స: కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ముందుగా అల్సర్, క్యాన్సర్ వంటివేమైనా ఉన్నాయా, లేక పేగుల పనితీరులో వచ్చిన మార్పు వల్లే ఈ లక్షణాలు మొదలయ్యాయా అన్నది నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తారు డాక్టర్లు. 40 ఏళ్ల లోపు వారిలో ఈ లక్షణాలతో పాటు బరువు తగ్గటం, జ్వరం, నొప్పి, మలంలో రక్తం పడటం వంటి ప్రమాదకర లక్షణాలేమీ లేకపోతే దాన్ని ఫంక్షనల్‌గా భావించి పరీక్షల అవసరం లేకుండా నేరుగా చికిత్స చేస్తారు. 40 ఏళ్లు పైబడిన వాళ్లలో ఏదైనా అనుమానం వస్తే ఎండోస్కొపీ, అల్ట్రాసౌండ్ స్కాన్, కొలనోస్కోపీ, బేరియం మీల్ వంటి పరీక్షల ద్వారా లోపల ఇతరత్రా సమస్యలేవీ లేవని నిర్ధారించుకున్న తరువాతే చికిత్స ప్రారంభిస్తారు.
మధుమేహం, థైరాయిడ్ సమస్యలున్న వారిలో పేగుల కదలికలు తగ్గుతాయి. దానివల్ల లోపల బ్యాక్టీరియా పెరిగి గ్యాస్ సమస్య తలెత్తుతుంది. వీరికి పేగుల కదలికలను మెరుగుపరిచేందుకు మెటాక్లోప్రమైడ్, ఇటియోప్రైడ్, మూసాప్రైడ్ వంటి 'ప్రొకైనెటిక్' రకం మందులు ఇస్తారు. ఇవి పేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. అలాగే హైపర్ థైరాయిడిజమ్, ఆందోళన, మానసిక ఒత్తిడి ఉన్న వారికీ పేగుల కదలికలు ఎక్కువవుతాయి. మరికొందరికి పేగులు మరీ సున్నితంగా స్పందిస్తాయి. ఇలా సున్నితత్వం ఎక్కువ ఉన్నవారికి 'మెబావరిన్' వంటి 'డీసెన్సిటైజర్లు' ఇస్తారు. వీటితో సమస్య సర్దుకుంటుంది.
జాగ్రత్తలు:
- బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ పడకపోతే మానేయడం మంచిది. దానివల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.
- పాలుతో చేసిన స్వీట్లు, గోధుమ పదార్థాలు తినకూడదు.
- గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి చేసే కందిపప్పు, పీచు పదార్థాలు మానెయ్యాలి.
- స్ట్రాలతో కూల్‌డ్రింక్స్ తాగటం, వేగంగా ఆహారం తీసుకోవడం మానెయ్యాలి.
Courtesy-Aayuraarogyalu

No comments:
Post a Comment