పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
పిత్తాశయంలో రాళ్లు ఉంటే ప్రమాదమా?
రాళ్లు ఉన్నట్లు గుర్తించడమెలా?
అసలు రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఏంచేయాలి?
ఇలాంటి ప్రశ్నలు అప్పుడో ఇప్పుడో అందరిలోనూ పుడుతూనే ఉంటాయి. నిజానికి పిత్తాశయం శరీరంలో అతి చిన్న విభాగమే అయినా, అందులో ఏదైనా సమస్య త తెత్తినప్పుడు కలిగే దుష్పరిణామాలు తక్కువేమీ కాదు.
పిత్తాశయం(గాల్‌బ్లాడర్) పొట్టకు కుడివైపున లివర్ కింది భాగంలో బే రిపండు ఆకారంలో ఉంటుంది. కాలేయం నుంచి ప్రసరించే పైత్యరసాన్ని పిత్తాశయం నిలువ ఉంచుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, జీర్ణక్రియకు తోడ్పడేందుకు ఆ నిలువ ఉంచుకున్న పైత్యరసాన్ని పిత్తాశయం బయటకు పంపుతుంది.పైత్యరసంలో నీరు, కొలెస్టరాల్, ఫ్యాట్స్, బైల్ సాల్ట్స్, ప్రొటీన్స్, బైల్‌రూబిన్‌లు ఒక నిర్ణీత పరిమాణంలో ఉంటాయి. పైత్యరసంలో కొలెస్టరాల్, బైల్‌రూబిన్ ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు పైత్యరసం గట్టిపడి రాళ్లుగా మారుతుంది. పిత్తాశయంలో కొలెస్టరాల్ రాళ్లు, పిగ్మెంట్ రాళ్లు అంటూ రెండు రకాల రాళ్లు ఏర్పడతాయి. కొలెస్టరాల్ రాళ్లు కాస్త పెద్దవిగానే ఉంటాయి. కొలెస్టరాల్ ఘనీభవించగా ఏర్పడిన రాళ్లు ఇవి. పిగ్మెంట్ రాళ్లు బైల్‌రూబిన్ వల్ల ఏర్పడతాయి. పిత్తాశయంలో ఒకటి లేక రెండు పెద్ద రాళ్లు ఏర్పడవచ్చు. ఒకవేళ చిన్నసైజులో ఉంటే అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడవచ్చు.
రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
మహిళల్లో ముఖ్యంగా 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. అధిక బరువు ఉన్న వారిలో ఏర్పడటానికి అవకాశం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలోఅధికంగా విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటివి పైత్యరసంలో ఉండే కొలెస్టరాల్ నిలువల్ని పెంచుతాయి. దీనివల్ల పిత్తాశయంలో కొవ్వు నిలువ ఉండిపోతుంది. చివరకు కొవ్వు రాళ్లుగా మారుతుంది. పిత్త సంబంధ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారిలో, సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యు సంబంధమైన రక్త వ్యాధులతో
బాధపడేవారిలోనూ పిగ్మెంట్ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కొలెస్టరాల్‌ను తగ్గించే మందుల వల్ల కూడా గాల్‌స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇవీ లక్షణాలు
పిత్తాశయంలో ఏర్పడే రాళ్లలో చాలా వరకు ఏ లక్షణాలూ కనిపించవు. కాకపోతే, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినపుడు వాటి కోసం చేసిన పరీక్షల్లో ఇవి బయటపడతాయి. ఇటువంటి వాటికి చికిత్స అవసరం లేదు. అలాకాకుండా అన్నం తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, తేన్పులు, అజీర్ణం, వికారం వంటి లక్షణాలుంటే చికిత్స అవసరం అవుతుంది. కడుపు నొప్పి, వాంతులు ఉంటే తీవ్రమైన లక్షణాలుగా పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా నొప్పి కడుపు పైభాగంలో వస్తుంది. ఒక్కోసారి కుడివైపున వస్తూ కుడి భుజంకు పాకుతూ ఉంటుంది. భోజనం చేసిన తరువాత ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ తరహా నొప్పిని బైలరీ కోలిక్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినపుడు పైత్యరసం బయటకు పోకుండా బ్లాక్ అవుతుంది. ఇది జాండిస్‌కు దారితీస్తుంది. జ్వరం, కళ్లు పచ్చగా మారడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
నిర్ధారణ
పిత్తాశయంలో రాయి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. లివర్ పనితీరు సరిగ్గా ఉన్నదీ లేనిదీ రక్తపరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కోసారి సి.టి.స్కాన్, ఎమ్ఆర్ స్కాన్, ఎమ్ఆర్ కొలన్‌జియోగ్రఫీ, హెచ్.ఐ.డి.ఎ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.
చికిత్స ఎలా ఉంటుంది?
గాల్‌బ్లాడర్‌లో ఉండే అన్ని రాళ్ల వల్ల ప్రమాదం ఉండదు. సైలెంట్ గాల్‌స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇలాంటి వాటికి చికిత్స అవసరం లేదు. ఒకవేళ రాళ్ల వల్ల సమస్యలు ప్రారంభమవుతున్నట్లయితే చికిత్స అవసరమవుతుంది. గాల్‌స్టోన్స్‌తో సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఆపరేషన్ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించడం ఒక్కటే మార్గమని డాక్టర్లు చెబుతారు. . రాళ్లను తొలగిస్తే మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల . కాబట్టి పిత్తాశయంను తొలగించడమే మంచిదని వాళ్లు చెబుతారు. . ఈ ఆపరేషన్‌ను ఓపెన్ సర్జరీ విధానంలోనూ, కీహోల్ విధానంలోనూ చేస్తుంటారు. ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేని వారికి ఒక దశ వరకు మందులే సూచిస్తారు. క్రమంతప్పకుండా మందులు వాడటం వల్ల రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మాత్రమే మందులతో కరుగుతాయి.అయితే మందులు మానేసినట్లయితే మళ్లీ రా

No comments:
Post a Comment